Akhanda 2:Thandavam Review: ‘అఖండ’ సనాతన ధర్మ యుద్ధం
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : 14 రీల్స్ ప్లస్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ , ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, సర్వ దమన్ బెనర్జీ,
కబీర్ సింగ్, వి జి చంద్ర శేఖర్, విక్రమ్‌జిత్ విర్క్, రచ్చ రవి, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, శాశ్వత ఛటర్జీ తది తరులు నటించారు.
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : సి. రాంప్రసాద్, సంతోష్ డి.దేటాకే
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటర్: తమ్మిరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేది : 12.12.2025
నిడివి : 2 ఘంటల 50 నిముషాలు
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల నాల్గవ కొలాబరేషన్ వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, బాలకృష్ణ, తనయ ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం గత వారం విడుదల కావలసింది. నిర్మాత గత చిత్రాల ఆర్ధిక పరమైన సమస్య ఈ చిత్రానికి ముడి వేయడం తో, డిసెంబర్ 5న చిత్రం విడుదల వాయిదా పడి అన్ని సమస్యలను పరిస్కరించుకుని ఈ రోజు సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అఖండ 1కి సిక్వల్ వస్తున్న అఖండ 2 : తాండవం ప్రేక్షకుడిని ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం
కథ:
అఖండ మొదటిభాగం ఎక్కడైతే ఆగిపోయిందో., రెండో భాగం అక్కడినుంచే మొదలుపెట్టారు. ఆ ముగిసిన కథకు సుమారు పద్దెమిదేళ్ళ తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. చైనాకు చెందిన మిలిటరీ భారత్‌పై దాడి చేసి సమగ్రతను దెబ్బ తీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత రాజకీయ నేత ఠాకూర్ (కబీర్ సింగ్) చేతులు కలుపుతాడు. మహ కుంభమేళాను టార్గెట్ చేసి గంగానదిలో వైరస్ కలుపుతారు. ఈ క్రమంలో ఎం ఎల్ ఏ బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురు జననీ (హర్షాలీ మల్హోత్రా) వైరస్‌కు వాక్సిన్ కనిపెడుతుంది. ఆ వ్యాక్సిన్‌ను, జననీని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ అధినేత ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అఖండ శికంధర్ రుద్ర (బాలకృష్ణ) జననికీ ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వస్తాడు. బాల మురళీ కృష్ణ ఎవరు? 17 ఏళ్ల వయసులోనే జననీ యువ సైంటిస్టుగా మారి దేశానికి ఎలాంటి సేవలు చేసింది? భూతాల మాంత్రికుడు నేత్ర గా నటించిన (ఆది పినిశెట్టి) పాత్ర ఏమిటి? భారత్‌పై చైనా దుష్టశక్తులు ఎలాంటి కుట్రలు పన్నారు? అఖండ అస్థిత్వం ఏమిటి? హైందవ ధర్మానికి అఖండ ఎలా అండగా ఉంటాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన ఒంటరిపోరాటం ఏమిటి? చైనా దుష్ట శక్తులను అఖండ ఎలా కాల రాచాడు అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం మిగతా సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
బాలకృష్ణ నటన గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏముంటుంది? మహా నటుడు యన్ టి ఆర్ పేరు నిలబెట్టేలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన అభినయాన్ని అధ్బుతంగా ప్రదర్శించే గొప్ప నటుడు బాలకృష్ణ. ఫస్టాఫ్‌లో బాల మురళీ కృష్ణ రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించదు. ఓ ఫైట్, ఓ సాంగ్ లో అలరించాడు. ఇక ప్రీ-ఇంటర్వెల్ ముందుగా వచ్చిన అఖండ సినిమా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడి మైండ్ లో నిలిచిపోయాడు. ఎప్పుడైతే అఖండ ఎంట్రీ అవుతాడో? అక్కడనుండి సినిమా ఒక్క సారిగా పరిగెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అఖండ పాత్ర మాత్రం చుస్తున్నపుడల్లా గూస్బంప్స్ తెప్పించేలా వుంది. స్క్రీన్ పై అతని ప్రసేన్తేషన్తో మిగతా పాత్రదారులను చూడకుండా చేయడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. రెండు మూడు సీన్లలో కనిపించిన సంయుక్త మీనన్ రోల్‌కు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదు. కాకపోతే ల్యాబ్ లో జరిగిన ఏక్షన్స్ లో ఆకట్టుకుంది, మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో నటనపరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే అవకాశమే కనిపించదు. హర్షాలీ పాత్ర కూడా అంతగా ఆకట్టుకొదు. ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల లిప్ సింగ్ కాకపోవడంతో ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. ఇక మిగితా పాత్రల్లో, విలన్ పాత్రల్లో కనిపించిన వారంతా వారి వారి నటనతో ఓకే అనిపించారు. శివుడు పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ అతను కూడా చాలా అద్భుతంగా నటించాడని చెప్పాల్సిందే.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాలో బాలకృష్ణ ఎంత హైలెట్ అయ్యాడో ఆ తర్వాత హైలెట్ అయింది మూవీలోని VFX విజువల్స్. ఒక్కో షాట్ చూసేవారికి ఫుల్ హై ఇచ్చింది. దానికి తోడు తమన్ కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్యూర్ గూస్బంప్స్ ను కలిగించింది. టెక్నీకల్ టీం విషయంలో హీరో తమన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటల విషయానికొస్తే నార్మల్ రేంజ్ లో వున్నాయి. ఇక ఆ తర్వాత హైలెట్ గా నిలిచింది మూవీలోని డైలాగ్స్. సినిమాలోని ప్రతి డైలాగ్ మంచి హై ఇచ్చిందని చెప్పొచ్చు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పని తీరు చాలా క్లియర్ గా కనిపించింది . లొకేషన్స్ , విజువల్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం టెక్నీకల్ టీం కూడా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నో లాజిక్స్ ఓన్లీ బోయపాటి, బాలకృష్ణ మ్యాజిక్ అఖండ 2, ప్యూర్ బోయపాటి బాలయ్య కాంబో ఇది. కథ లేకపోయినా ఎలివేషన్స్ తో సినిమా కంప్లీట్ చేయొచ్చని .. ఇలా కూడా ప్రేక్షకులని మెప్పించొచ్చని బోయపాటి నిరూపించి చూపించాడు.ఆ రేంజ్ లో ఇద్దరు ప్రేక్షకుల మైండ్ లో ప్రింట్ వేసేసారు. ఇదే కథకు దర్శకుడు మారినా లేదా హీరో బాలకృష్ణ కాకపోయినా అసలు సినిమా చూడాలనిపించేది కాదేమో. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసాడు బోయపాటి. ఇక్కడ అఖండ 2 విషయంలో కూడా ఇదే జరిగింది. బిగినింగ్ నుండి సినిమా ఎండ్ వరకు చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యాడు బోయపాటి. అంటే అక్కడ లాజిక్స్ తో సంబంధం లేదు. ఓన్లీ మ్యాజిక్ అన్నట్టు తెర మీద కనిపిస్తున్న దానికి విజిల్స్ వేసుకుంటూ కూర్చోడమే. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.
విశ్లేషణ :
ఫైనల్‌గా అఖండ తాండవం గురించి చెప్పాలంటే.. అఖండ చిత్రంలో కథ, కథనాలు, ఎమోషన్స్ చక్కగా వర్కవుట్ అయ్యాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కావడంతో ఆ సినిమా ఆకట్టుకుంటుంది. అఖండకు ఏవైతే బలంగా మారాయో. కొన్ని మైనస్ కూడా అయ్యాయి. పొంతన లేని కథ, కథనాలు, ఫోకస్ లేని బోయపాటి టేకింగ్ ఈ సినిమాకు మైనస్. గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ, మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ డివోషనల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. లాజిక్స్ చూసుకోకుండా సినిమా అనేది వినోదం కోసం అనుకుంటే మాత్రం సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ను ఇస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం ఈ చిత్రం పుల్ మీల్స్.






