జీ తెలుగు ఆధ్వర్యంలో హైదరాబాద్ నక్లెస్ రోడ్లో 54 అడుగుల పవన్ కల్యాణ్ భారీ కటౌట్
‘బ్రో– ది అవతార్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా రానున్న సందర్భంగా జీ తెలుగు ఆధ్వర్యంలో మెగా మార్కెటింగ్ క్యాంపెయిన్, హైదరాబాద్ నక్లెస్ రోడ్లో యాభై నాలుగు అడుగుల భారీ కటౌట్!
ఆసక్తికరమైన సీరియల్స్‌తోపాటు వినోదభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో బ్లాక్‌బస్టర్ సినిమాతో మీ ముందుకు రానుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సూపర్‌హిట్ సినిమా ‘బ్రో– ది అవతార్’ ను అక్టోబర్ 15, ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందించేందుకు సిద్దమైంది. ఈ సందర్భంగా పవర్‌స్టార్ అభిమానులను మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది జీ తెలుగు. హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద అక్టోబర్ 10, మంగళవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో యాభై నాలుగు అడుగుల పవన్ కల్యాణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించనుంది.
కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా థియేటర్లలో విడుదలైన బ్రో ప్రేక్షకులను మెప్పించి సూపర్‌హిట్ టాక్ అందుకుంది. జీ తెలుగు వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు మీ ముందుకు రానుంది. మెగా మామ-అల్లుడు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సముద్రఖని రూపొందించారు. ఈ ఫాంటసీ డ్రామాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది.
ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైల్, యాక్షన్, లుక్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చే ప్రతి సీన్ నవ్వులు పూయిస్తుంది. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమాలో పవర్ స్టార్ ‘టైం’గా న్యూ అవతార్‌లో అలరించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రాజా చెంబోల్, రోహిణి మొల్లెటి, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా రానున్న బ్రో సినిమాను మీరూ మిస్సవకండి!
బ్రో వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్‌గా రానున్న సందర్భంగా ఈ సినిమా సూపర్ సక్సెస్‌ని మరోసారి గుర్తు చేసేందుకు జీ తెలుగు నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ పవన్ కల్యాణ్ 54 అడుగుల భారీ కటౌట్ ఆవిష్కరణ. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆవిష్కరించనున్న ఈ భారీ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది. మీడియా, అభిమానుల సమక్షంలో ఈ కటౌట్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – అనురాధ గూడూరు మాట్లాడుతూ, ‘ఈ ఏడాది విడుదలైన సూపర్‌హిట్ సినిమాల్లో ‘బ్రో’ సినిమా ఒకటి. జీ తెలుగు ఛానల్లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా మీ ముందుకు రానున్న సందర్భంగా పవన్ కల్యాణ్ కట్అవుట్ ఆవిష్కరించడం ఆయన మీద ప్రేక్షకులకు ఉన్న అభిమానానికి చిరునామా. 54 అడుగుల కటౌట్ ను ఆవిష్కరించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భారీ కటౌట్ ను చూసేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు దిగడంతో పాటు మీడియా ముందు కేక్ కట్ చేశారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కట్అవుట్ పవన్ అభిమానుల సంబరాలకు వేదికగా మారింది. పవన్ కల్యాణ్ అభిమానుల ఆదరణ పొందిన ఇలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేం సంతోషిస్తున్నాం. టెలివిజన్ ప్రీమియర్‌గా ‘బ్రో-ది అవతార్’ సినిమా కూడా విశేష ఆదరణ దక్కించుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో– ది అవతార్’, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో!













