నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కు ప్రతిరూపంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాల్లో బ్రాండ్ యాంతమ్ ని లాంచ్ చేస్తున్న జీ సినిమాలు
సినిమా నిజజీవితాలకు అద్దం పడుతుంది. చూసే వాళ్లకి వేరే జీవితం చూస్తునట్టుగా ఉన్నా, మన అందరం అందులో పాత్రలమే ఎందుకంటే మన జీవితాలే సినిమాలు కాబట్టి అలాంటి సినిమాలని అందరికి అందిస్తూ వస్తుంది మన జీ సినిమాలు. సెప్టెంబర్ 04 2016లో మొదలైన జీ సినిమాలు ఛానల్ దిగ్విజయంగా 5వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా లోగో ఆవిష్కరణ జరిగిన జీ సినిమాలు, ‘దిల్ పై సూపర్‌హిట్’ అనే బ్రాండ్ ఫిలాసఫీతో సినీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. ఎన్నో అద్బుతమైన సినిమాల్ని అందించింది, అందిస్తూనే ఉంది. అన్నింటికి మించి మూవీ చానల్స్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అనే కాన్సెప్ట్‌ని పరిచయం చేసింది మన జీ సినిమాలు.
జీ సినిమాలు ప్రదర్శించే ప్రతి సినిమా కూడా మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. అది శతమానం భవతి కావచ్చు, బొమ్మరిల్లు కావచ్చు లేదా అరవింద సమేత కూడా కావచ్చు. ఇంటిల్లిపాది కూర్చొని వీక్షించే విందగా వారు అందర్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాంటి జీ సినిమాలు ఈసారి “రారా మామ, జీ లో సినిమా” అనే బ్రాండ్ ఆంతమ్ తోటి మన ముందుకు వస్తుంది. ఆ పాటకి రామ్ మిరియాలా సంగీతం సమకూర్చి ఆలపించారు. అలాగే జీ సినిమాలు ఛానల్ లుక్ కి సరికొత్త హంగులు కూడా చేర్చబోతుంది.
అందువల్లే తెలుగు రాష్ట్రల అంతటా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. జీ సినిమాలు హెచ్డీ వేరియంట్‌ని డిసెంబర్ 31, 2017లో ప్రారంభించారు.
జీ సినిమాలు బ్రాండ్ యాంతమ్ ను సెప్టెంబర్ 4న తప్పకుండా మన జీ సినిమాలు ఛానల్ లో వీక్షించండి.













