Rakul Preeth Singh: మీ మొదటి శత్రువు కంఫర్టే: రకుల్
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అయితే గత కొంత కాలంగా రకుల్ కు ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. రకుల్ ప్రస్తుతం తన భర్త నిర్మాణంలో చేస్తున్న బాలీవుడ్ సినిమాపైనే రకుల్ తన ఫోకస్ పెట్టింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రకుల్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.
తన మూవీలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటూ, వ్యక్తిగత అభిప్రాయాలను కూడా షేర్ చేస్తూ ఉండే రకుల్ తాజాగా తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. అందులో అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రమ్మని, కంఫర్ట్ గా ఉన్న ప్రదేశం మీకెప్పుడైనా శత్రువుగా మారుతుందని రాసి ఉన్న కోట్ ను పోస్ట్ చేసింది.
ప్రజలు సోమరితనంగా మారడానికి రీజన్ ఎప్పుడూ ఒకే ప్లేస్ లో ఉండటమని, దాని వల్ల సౌకర్యం ఎక్కువ అవుతుందని, ఎవరూ ఒక వర్క్ నుంచి మరో వర్క్ కు మారడం లేదని, రెగ్యులర్ గా అలవాటైన వర్కే చేస్తున్నారని, వీటన్నింటినీ అలవాటు పడి ఏదైనా కావాలనుకున్నప్పుడు కూడా రేపు చూద్దాంలే అనుకుంటున్నారని, దీని వల్లే చాలా మంది ఎదగడం లేదని రకుల్ షేర్ చేసిన కోటేషన్ లో ఉంది. జీవితంలో పైకి ఎదగాలంటే కఠినమైన విషయాల గురించి ఆలోచించి, వాటిని ఆచరణలో పెట్టాలని అప్పుడే సక్సెస్ అందుకుంటామని చెప్పింది.













