బిగ్ బ్యానర్ లో యేలేటి సినిమా..
టాలీవుడ్ లో హిట్లు, బ్లాక్ బస్టర్లు అని చూసుకోకుండా గత రెండు దశాబ్థాల్లో బెస్ట్ డైరక్టర్స్ ఎవరు అని చెప్పుకుంటే చంద్రశేఖర్ యేలేటి ఒకడు. కానీ కమర్షియల్ గా మాత్రం యేలేటికి రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. మనమంతా తర్వాత ఆయన నుంచి మరో సినిమా రావడానికి నాలుగున్నరేళ్లు దాటిపోయింది.
నాలుగున్నరేళ్ల తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ వచ్చే శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా తన కెరీర్ కు మైలు రాయిగా నిలుస్తుందని ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు. ఇకపై తన కెరీర్ లో గతంలో లాగా గ్యాప్ ఉండదని, వరుసగా సినిమాలు తీస్తానని చెప్పారు.
తన తర్వాతి సినిమా టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే దిగ్గజ బ్యానర్ గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ లో ఉంటుందని, అది కూడా ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిన హీరోతోనే అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాతో పాటుగా మరో సినిమాకు కూడా కమిట్ అయ్యానని, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తానని యేలేటి అన్నారు. ఇన్నాళ్లకు యేలేటి కెరీర్ కు ఇక బ్రేకులు పడనట్లే.













