బాలీవుడ్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యతో హీరోయిన్ యామీ గౌతమ్ పెళ్లి జరిగింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను వెల్లడించారు. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‍తో ప్రేక్షకులకు పరిచయమైన యామినీ ఉల్లాస ఉత్సాహ అనే కన్నడ చిత్రంలో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. విక్కీ డోనర్‍తో బాలీవుడ్‍లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్ మొదటి చిత్రానికే ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో నటించింది. యామీ చివరిసారిగా నితిన్ సరసన కొరియార్ బాయ్ కల్యాణ్‍లో నటించింది. ప్రస్తుతం ఆమె భూత్ పోలీస్‍తో పాటు దస్వీ, ఎథర్స్డే చిత్రాల్లో నటిస్తోంది.