గోపీచంద్ తో శివ సినిమా చేస్తాడా?
రీసెంట్ గా విశ్వం(Viswam) సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand). లౌక్యం(Loukyam) సినిమా తర్వాత గోపీచంద్ అకౌంట్ లో ఇప్పటివరకు మరో హిట్ పడింది లేదు. అతను చేసిన పక్కా కమర్షియల్(Pakka Commercial), రామ బాణం(Rama Banam), భీమా(Bhima), విశ్వం సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్ అవడంతో ఆ ఎఫెక్ట్ ఆయన మార్కెట్ పై పడింది.
ఇప్పుడెలా అయినా సరే గోపీచంద్ తన తర్వాతి సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్(Jil) డైరెక్టర్ రాధా కృష్ణ(Radha Krishna)తో పాటూ మరో కొత్త డైరెక్టర్ తో కూడా గోపీ డిస్కషన్స్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎప్పట్నుంచో కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ శివ(Siva)తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో గోపీచంద్ ఉన్నాడు. శివతో గోపీచంద్ కు మంచి అనుబంధమే ఉంది.
శివ డైరెక్టర్ గా పరిచయమైంది గోపీచంద్ శౌర్యం(Shouryam) సినిమాతోనే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శంఖం(Sankham) సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా మంచి టాకే తెచ్చుకుంది. తనకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ పై తనకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుందని కంగువ(Kanguva) ప్రమోషన్స్ లో శివ కూడా చెప్పాడు. అంతేకాదు గోపీచంద్ తో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని, టైమ్ కుదిరినప్పుడు తమ కాంబోలో తప్పకుండా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కంగువ అనే పాన్ ఇండియా సినిమా చేసిన శివ, ఆ సినిమాతో హిట్ అందుకుంటే తర్వాత స్టార్ హీరోలు వెంటపడే ఛాన్సుంది. అలాంటప్పుడు శివ టైర్2 హీరో అయిన గోపీచంద్ తో సినిమా చేస్తాడా అనేది ప్రశ్నగా మారింది.













