Game Changer: ఇండియన్3 భారమంతా గేమ్ ఛేంజర్ పైనే!
గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాపై మెల్లిగా హైప్ పెరుగుతుంది. ఇప్పటికే సినిమా నుంచి ఒక టీజర్, మూడు పాటలు రిలీజయ్యాయి. యుఎస్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దోప్ ఆడియో రిలీజ్ కానుంది. కంటెంట్ విషయంలో ఫ్యాన్స్ అయితే శాటిస్ఫై అవుతున్నారు కానీ నార్మల్ ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెంచేలా ప్రమోషన్స్ ను ఇంకాస్త వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం రామ్ చరణ్(ram charan), దిల్ రాజు(dil raju) కు ఎంత కీలకమో శంకర్(shankar), లైకా ప్రొడక్షన్స్(lyca productions) కు కూడా అంతే కీలకం. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పైనే ఇండియన్3(indian2) హైప్ ఆధారపడి ఉంది. సెకండ్ పార్ట్ డిజాస్టర్ అవడమే కాకుండా ఎప్పుడూ లేనిది శంకర్ ని మొదటిసారి ట్రోల్ అయ్యేలా చేసింది.
కాబట్టి గేమ్ ఛేంజర్ సక్సెస్ అవడం ఎంతో ముఖ్యం. గేమ్ ఛేంజర్ రికార్డు స్థాయి వసూలు చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇండియన్3 కు బిజినెస్ మార్గాలు ఉంటాయి. శంకర్ మార్క్ మిస్ అవలేదని, గేమ్ ఛేంజర్ తో శంకర్ బ్యాక్ అయ్యాడని అందరూ భావించి ఇంట్రెస్ట్ చూపిస్తారు. జనవరి 10న రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ కు ఇప్పటికే ఒక్కో ఏరియా వారాగా బిజినెస్ అవుతూ వస్తుంది. వినయ విధేయ రామ(Vinaya vidheya rama) తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.













