డబుల్ ఇస్మార్ట్ ఆ మ్యాజిక్ రిపీటవుతుందా?
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత రామ్ వరుస సినిమాలు చేస్తున్నా మెప్పించలేకపోయాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ కూడా విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేశాడు కానీ అది దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.
దీంతో రామ్, పూరీ మరోసారి కలిసి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తీశారు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత కమెడియన్ అలీతో పూరీ ఈ సినిమా కోసం వర్క్ చేశాడు.
ఒకప్పుడు పూరీ సినిమాలో అలీకి స్పెషల్ ట్రాక్స్ ఉండేవి. కానీ ఈ మధ్య పూరీ అలీని పక్కనపెట్టాడు. ఇప్పుడు మళ్లీ డబుల్ ఇస్మార్ట్ కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు. ఈ మధ్య అలీ జోరు కూడా తగ్గడంతో పూరీ ఇచ్చిన పాత్రకు వెంటనే ఒప్పుకున్నాడని, డబుల్ ఇస్మార్ట్ లో మరోసారి అలీ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని యూనిట్ సభ్యులంటున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ కాపీ చూసి పూరీ చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.













