‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ లుక్ విడుదల
నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం వైల్డ్ డాగ్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అహిషోర్ సాల్మోన్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఫస్ట్‌లుక్‌లో నాగార్జున చేతిలో గన్ కనిపిస్తోంది. ఇందులో ఎన్ఐఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారి పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర పేరు విజయవర్మ. ఆయనను అందరు వైల్డ్ డాగ్ అని పిలుస్తారు. జాతీయ వార్త పత్రికల్లో వచ్చి కథనాలు ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. కిరణ్ కుమార్ సంభాషణలు అందించారు. షానియల్ డియో ఛాయాగ్రహణం అందిస్తున్నారు.













