కొత్త సినిమాకు ఇంకా రెడీ అవని మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఇంద్ర రీరిలీజ్ ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అదెంత గ్రాండ్ గా అంటే తన కొత్త సినిమా విశ్వంభర నుంచి వచ్చిన కొత్త పోస్టర్ కంటే ఇంద్ర రీరిలీజ్ సెలబ్రేషన్సే హైలైట్ అయ్యేంత. ఇవన్నీ పక్కన పెడితే చిరూ బర్త్ డే సందర్భంగా తన 157వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేశారు.
కానీ అది రాలేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్న చిరంజీవి మరికొంత టాకీ పార్ట్, ఒక సాంగ్ పూర్తయితే సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తాడు. చేస్తున్న సినిమా ఆఖరి దశలో ఉన్నప్పటికీ చిరూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను లాక్ చేసుకోకపోవడం వెనుక భోళా శంకర్ ఇచ్చిన ఫలితం ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది.
తన వయసుని దృష్టిలో పెట్టుకుని తనకు సెట్ అయ్యే సినిమాలను మాత్రమే చేయాలని చిరూ డిసైడ్ అయ్యాడట. అందుకే కూతురు సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ తో చేయాల్సిన సినిమాను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. చిరూ తర్వాతి సినిమాను గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. బీవీఎస్ రవి అందించిన కథ ఓకే అయినప్పటికీ డైరెక్టర్ విషయంలోనే పేచీ వచ్చిందంటున్నారు. అందుకే చిరూ తన తర్వాతి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విశ్వంభర బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్న చిరూ ఇకపై కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.













