Akhanda2: అఖండ2 కోసం ఎవరెంత తీసుకున్నారంటే
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ(balakrishna) హీరోగా వస్తున్న సినిమా అఖండ2(Akhanda2). బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఈ మూవీ అఖండకు సీక్వెల్ గా వస్తుండటంతో ఎప్పుడెప్పుడు అఖండ2ని చూస్తామా అని బాలయ్య(balayya) ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే అఖండ2 బడ్జెట్ గురించి, రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. అఖండ సినిమాకు వచ్చిన సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ మూవీని మరింత భారీగా నిర్మించారని, సినిమా మొత్తం పూర్తవడానికి రూ.200 కోట్లు ఖర్చైందని తెలుస్తోండగా, అందులో రూ.145 కోట్లు థియేట్రికల్ బిజినెస్ ద్వారా వెనక్కి వచ్చిందని అంటున్నారు.
ఇక రెమ్యూనరేషన్ విషయానికొస్తే ఈ మూవీకి బాలయ్య రూ.40 కోట్లు తీసుకున్నారని, గత కొన్ని సినిమాలుగా బాలయ్య తన రేటును భారీగా పెంచారని, ఈ నేపథ్యంలోనే అఖండ2కు కూడా బాలయ్య భారీగా తీసుకున్నారని సమాచారం. బోయపాటి శ్రీను అఖండ2 కోసం రూ.35 కోట్లు ఛార్జ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే రాజమౌళి(rajamouli),సుకుమార్(sukumar) తర్వాత టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకున్న డైరెక్టర్ గా బోయపాటి మూడో స్థానంలో ఉంటాడు.






