ఆ కాంబో లేనట్టేనా?
ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప2 చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను అట్లీతో చేయనున్నాడని మొన్నా మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ కాంబోలో అనుకున్న పాన్ ఇండియా సినిమా ఉండకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అట్లీ రాసుకున్న ఫైనల్ వెర్షన్ తో అల్లు అర్జున్ ను మెప్పించలేకపోయాడట. అంతే కాదు, డైరెక్టర్ గా తనకు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ను అడిగాడని, అంత పెద్ద మొత్తమంటే రిస్క్ అవుతుందేమో అనుకోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవచ్చంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా గురించి ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అంతా ఇన్సైడ్ ఇన్ఫర్మేషనే.
అట్లీ సినిమా క్యాన్సిల్ అవడం, పుష్ప2 రిలీజ్ ఇంకా లేటవడంతో బన్నీ తర్వాత చేయబోయే సినిమాల గురించి ఆలోచిస్తున్నాడట. తన దగ్గర ఉన్న ఆప్షన్స్ లో మొదటిది త్రివిక్రమ్ సినిమా. కానీ ఇంకా దానికి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ సిద్ధం చేయలేదు. రెండో ఆప్షన్ సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్ తో స్పిరిట్ చేశాకే వేరే సినిమా చేస్తానని సందీప్ ఇప్పటికే చెప్పాడు. దీంతో ఇప్పుడు బన్నీకి బాక్సాఫీస్ వద్ద గ్యాప్ వచ్చే ఛాన్సుంది. అందుకే సుకుమార్ ఐడియా అయిన పుష్ప3ను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడట బన్నీ. అయితే ఈ విషయాన్ని అధికారిక ప్రకటన వస్తే కానీ నమ్మలేం.













