రవితేజ మూవీలో హీరోయిన్ ఎవరు?
ఈ మధ్య స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం చాలా కష్టమైపోయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టీమ్ సభ్యులను కూడా మేకర్స్ అనౌన్స్ చేసి బాగా ప్రమోట్ చేశారు. రైటర్లకు కూడా ఫోటోలు తీయించి పబ్లిసిటీలో వాడుకోవడం ఇదే ఫస్ట్ టైమ్.
డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత రవితేజ-గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదు. రష్మిక కోసం ట్రై చేసినప్పటికీ కాల్షీట్స్ అడ్జస్ట్ కాలేదని నో చెప్పిందట. ఆ తర్వాత ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని కూడా అడిగారట.
ఇంకా అమ్మడు ఏ సంగతి చెప్పలేదని తెలుస్తోంది. రవితేజ పక్కన మరి కృతి సెట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. వీరిద్దరూ కాకుండా మూడో ఆప్షన్ కోసం కూడా వెతుకుతున్నారు కానీ ఇంకో వారం పది రోజులు ఆగితే కానీ ఈ సినిమాలో హీరోయిన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందనున్నట్లు తెలుస్తోంది.













