ఇంతకీ ఎల్లమ్మలో హీరో ఎవరు రాజు గారు?
బలగం(Balagam) హిట్ తర్వాత డైరెక్టర్ వేణు యెల్దండి(Venu Yeldandi) ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆ టైమ్ మొత్తాన్ని తన తర్వాతి సినిమా ఎల్లమ్మ(Yellamma) స్క్రిప్ట్ మీదే ఖర్చు చేశాడు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని(Natural Star Nani)తో చేయలని వేణు ఎంతగానో ట్రై చేశాడు. కానీ అది వర్కవుట్ అవలేదు. ఈ సినిమా గురించి అడిగినప్పుడల్లా నాని, తనకు వేణు అంటే ఎంతో ఇష్టమని ఫ్యూచర్ లో తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్తున్నాడు తప్పించి ఎల్లమ్మ సినిమా అని మాత్రం చెప్పడం లేదు.
అయితే ఎల్లమ్మ కథ దిల్ రాజు(Dil Raju) కు ఎంతగానో నచ్చింది. అందుకే వేణుని వేరే ప్రొడక్షన్ హౌస్ కు పంపకుండా అక్కడే లాక్ చేసుకున్నాడు. రీసెంట్ గా జరిగిన జనక అయితే గనక(Janaka Ayithe Ganaka) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేణుని దిల్ రాజు ఎల్లమ్మ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావంటే మీరెప్పుడంటే అప్పుడే అని వేణు చెప్పాడు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాంలే అని అక్కడ ఆ టాపిక్ ను ముగించారు.
దీన్ని బట్టి చూస్తుంటే ఎల్లమ్మ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తైనట్లు అర్థమవుతుంది. హీరో నాని కూడా కాదని క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ కథను వేణు, నితిన్(Nithin) కు చెప్పాడని టాక్. మరి ఒప్పుకున్నాడా లేదా అనేది మాత్రం తెలియదు. దిల్ ఒకవేళ నితిన్ కూడా కాదంటే శర్వానంద్(shawanand) కోసం ట్రై చేస్తారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.













