చెప్పిన టైమ్ కు సినిమాలు రిలీజ్ అయ్యేనా..?
కరోనా తర్వాత టాలీవుడ్ నిర్మాతలు ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా తమ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించారు. కొన్ని వారాల వ్యవధిలో పదుల సంఖ్యలో సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కరోనా కారణంగా గత ఏడాది చాలా సినిమాలు మధ్యలో, పూర్తయ్యాక ఆగిపోవడంతో ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాల కౌంట్ చాలా ఎక్కువైంది. దీంతో రిలీజ్ కోసం చాలా ముందు నుంచే కర్చీఫ్ లు వేయాల్సి వచ్చింది.
సినిమా రిలీజ్ చేస్తామో లేదో ముందు డేట్ అయితే అయితే మాత్రం ఇచ్చేద్దామన్నట్లు ఒకరిని చూసి మరొకరు వరుసగా అనౌన్స్ మెంట్స్ ఇచ్చేశారు. ఇప్పుడేమో ఆ డెడ్ లైన్ దగ్గరకు వస్తుంటే టైమ్ ను అందుకోవడానికి కిందా మీదా అయిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్లే కావచ్చు లేదా మరి ఏ ఇతర కారణాల వల్లే కావచ్చు షూటింగ్ లు ప్రస్తుతం అనుకున్నట్లుగా మాత్రం సాగట్లేదు. ఈ నేపథ్యంలో కొన్ని పేరున్న సినిమాలకు రిలీజ్ డేట్లు మార్చుకోక తప్పేట్లు లేదు.
దాంట్లో ఒకటి ఈ ఇయర్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో ఒకటైన పుష్ప వాళ్లు చెప్పిన ఆగస్టు 13న రావడం సందేహమే అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా భారీ కాస్ట్ అండ్ క్రూ తో ముడిపడటం, ఇప్పటికే ఒకసారి ఎక్కువ మంది తో షూట్ చేస్తూ కరోనా దెబ్బ కొట్టడంతో కొన్ని వారాలు షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ యూనిట్ ను భయపెడుతుంది. ఇంకా చాలా రోజులు ఎక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ తో షూటింగ్ చేయాల్సి ఉంది. సినిమాకు మధ్యలో బ్రేకులు పడటం, లొకేషన్లు పదే పదే మార్చాల్సి రావడంతో సినిమా అనుకున్న టైమ్ కు వచ్చే ఛాన్సులు చాలా తక్కువని చాలా మంది అంటున్నారు.
ఇంకో సినిమా బాలయ్య, బోయపాటి కాంబో లో రానున్న బిబి3. మే 28న సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఈ సినిమా కూడా అనుకున్న టైమ్ కు వచ్చే అవకాశాల్లేవని చెప్తున్నారు. ఇంకో రెండు నెలల్లోపే సినిమా రిలీజ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ అవదు అనడానికి ఇదే ఉదాహరణగా చూపిస్తున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు, రీషూట్ల వల్లే సినిమా వాయిదా పడే ఛాన్సులున్నాయని చెప్తున్నారు. మరి నిజంగా ఈ సినిమాల పోస్ట్ పోన్ ఉంటుందో లేదో తెలీదు కానీ ఈ విషయమై ఆయా సినిమాల నిర్మాతలు నోరు విప్పితే కానీ ఇలాంటి వార్తలు ఆగవు.













