4న వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ఫస్ట్ లుక్ విడుదల
రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా నటిస్తోన్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. ఈ చిత్రం ద్వారా కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారు. హీరోయిన్ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో నితిన్ ఈ నెల 4న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్, పంకజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా చిత్రంలోని హాస్యం ప్రేక్షకులకు బాగా అలరిస్తోంది చిత్రబృందం చెబుతుంది. ఇంతుకుముందు చిరంజీవి ఖైదీ నెం 150వ చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో రాయ్ లక్ష్మి ప్రత్యేక పాటలో నటించింది.













