బోయపాటి నెక్ట్స్ ఎవరితో?
ఎప్పటికీ ఒకటే రొటీన్ మాస్ ఫార్ములా వర్కవుట్ అవదని రామ్-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమా ప్రూవ్ చేసింది. స్కంద రిజల్ట్ తో బోయపాటి క్రేజ్ మొత్తం పడిపోయింది. కాంబినేషన్‌పై ఉన్న అంచనాల కారణంగా స్కందకు ఓపెనింగ్స్ వరకు బాగా వచ్చాయి కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ ఎఫెక్ట్ బోయపాటి చేయనున్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడనుంది. ప్రెజెంట్ టాలీవుడ్ లోని టైర్1 హీరోలంతా భారీ లైనప్‌తో చాలా బిజీగా ఉన్నారు. బోయపాటి మాత్రం తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ లో ఉన్నాడు. తనకు సరైనోడు లాంటి హిట్ ఇచ్చిన బోయపాటితో సినిమా చేసేందుకు బన్నీ రెడీగా ఉన్నప్పటికీ అది ఇప్పట్లో కుదిరేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం పుష్ప2 తో బిజీగా ఉన్న బన్నీ, తర్వాత త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లను లైన్లో పెట్టాడు. కాబట్టి వీరి కాంబోలో ఇప్పుడే సినిమా ఉండే అవకాశం లేదు. మొన్నా మధ్య తమిళ హీరో సూర్యతో బోయపాటి సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. ప్రస్తుతం కంగువా అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సూర్య, స్కంద లాంటి డిజాస్టర్ తీసిన బోయపాటికి ఛాన్సిస్తాడా అనేది అనుమానంగా ఉంది.
ఇక ఆఖరిగా బోయపాటికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ బాలయ్య మాత్రమే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చి అవన్నీ బ్లాక్ బస్టర్లు కావడంతో వీరి కాంబోలో మరో సినిమా రానుందని ఎప్పటినుంచో అంటున్నారు. బోయపాటి కూడా అఖండ2 ఉంటుందని హింట్ ఇచ్చాడు కాబట్టి మరి బోయపాటి తర్వాతి సినిమా బాలయ్యతోనే ఉండే అవకాశముందేమో చూడాలి. ఒకవేళ బాలయ్య-బోయపాటి సినిమా ఓకే అయినా దానిక్కూడా టైమ్ పట్టనుంది.













