బాలయ్య రాకపోవడానికి రీజనేంటి?
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఈ ఏడాది ఏఎన్నార్ శత జయంతి వేడుకలు మొదలయ్యారు. సెప్టెంబర్ 20న ఏఎన్నార్ 99వ జయంతి పూర్తి కాగా, ఇక నుంచి ఏడాది పాటూ శత జయంతి వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని అక్కినేని ఫ్యామిలీ ఆవిష్కరించింది.
ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు. పొలిటీషియన్ వెంకయ్య నాయుడు తో పాటూ మరికొందరు రాజకీయ నేతలు కూడా ఈ ఫంక్షన్‌కు వచ్చారు. మహేష్ బాబు, నాని, మోహన్ బాబు, రామ్ చరణ్, బ్రహ్మానందం, జయసుధ, ఇలా చాలామందే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు మిస్ అయిన వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఏఎన్నార్ చనిపోయినప్పుడు చివరి చూపు కోసం కూడా బాలయ్య రాలేదు.
నాగ్ తో బాలయ్యకు ఏమైనా చెడిందో ఏమో తెలీదు కానీ వీళ్ల నుంచి చాలా కాలంగా సరైన మాటలు లేవని టాక్స్ ఉన్నాయి. గత పదేళ్లలో వీరిద్దరూ కలిసింది కానీ మాట్లాడుకుంది కానీ లేదు. మొన్నామధ్య ఓ సందర్భంలో బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారి పెద్ద వివాదమే సృష్టించాడు. ఆ తర్వాత దానికి బాలయ్య ఎంత వివరణ ఇవ్వాలని చూసినా అది పెద్ద రచ్చే అయింది. ఇంతకీ ఇప్పుడు ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలకు బాలయ్యను నాగ్ పిలవలేదా లేక బాలయ్య వేరే పనుల్లో ఈ కార్యక్రమానికి రాలేకపోయాడా అనేది తెలియాల్సి ఉంది.













