క్రిష్ నెక్ట్స్ ఎవరితో?
జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఒకడు. అతను ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఆయన కథ చెప్తానంటే వినేందుకు పెద్ద హీరోలు సైతం రెడీగా ఉంటారు. దానికి కారణం క్రిష్ కథల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండటమే. దాని వల్ల నటీనటులు వారి టాలెంట్ ను కొత్తగా చూపే అవకాశముంటుంది.
గమ్యం(Gamyam), వేదం(Vedam), కృష్ణం వందే జగద్గురుమ్(Krishnam Vande Jagadgurum), గౌతమీపుత్ర శాతకర్ణి(Gauthamiputra Saathakarni) సినిమాలతో డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్(NTR Biopic), కొండపొలం(Konda polam) సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నాడు. అయినప్పటికీ వెంటనే పవన్(Pawan) తో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం విశేషం. అయితే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ అయ్యాక కొన్ని కారణాల వల్ల క్రిష్ ఆ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
ఆ విషయంలో క్రిష్ పై ఎన్నో వార్తలొచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అనుష్క(anushka)తో ఘాటి(ghati) అనే సినిమాను మొదలుపెట్టి ఎంతో వేగంగా షూటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. అయితే ఘాటి తర్వాత క్రిష్ ఎవరితో వర్క్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం క్రిష్ తన తర్వాతి సినిమాను మీడియం రేంజ్ హీరోలైన విజయ్ దేవరకొండ(vijay devarakonda), రామ్ పోతినేని(ram pothineni)తో చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కథలు కూడా రెడీగా ఉన్నాయట. ఘాటి సినిమా రిలీజ్ లోపు ఏదొక హీరోని ఫైనల్ చేసి అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నాడట క్రిష్. మరి అతని కథకు ఏ హీరో సూటవుతాడో చూడాలి.













