ఎంతో జాగ్రత్తగా మెగాస్టార్ నెక్ట్స్
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటికే ఐదు సినిమాలు చేస్తే వాటిలో వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయింది. మిగిలిన సినిమాలు చెప్పుకోదగ్గ రేంజ్ లో ఆడలేదు. మెగాస్టార్ గత చిత్రం భోళా శంకర్ చిరూ కెరీర్లోనే టాప్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. చిరూ తన తర్వాతి సినిమాల కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు.ప్రేక్షకుల అభిరుచి మారడంతో కమర్షియల్ సినిమాలు కాకుండా బలమైన కథ, కథనాలతో పాటూ ఫిక్షనల్ కాన్సెప్టులతో సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జులై లోపు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరూ ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. చిరంజీవి కూడా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుని సినిమాలు చేయాలనుకుంటున్నాడు. టాలీవుడ్ లోని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని చిరూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇప్పటికే డైరెక్టర్లను పిలిపించుకుని కథలు వింటున్నారట. వారిలో ఓ యంగ్ డైరెక్టర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గా ఓ కథను ఆ డైరెక్టర్ చిరూకి చెప్పగా ఆ కథ మెగాస్టార్ కు నచ్చినట్లు చెప్తున్నారు. ఇలా కాకుండా చందూ మొండేటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని చిరంజీవి అనుకుంటున్నాడట. వీరితో పాటూ హరీష్ శంకర్ పేరు కూడా చిరంజీవి నెక్ట్స్ డైరెక్టర్ల లిస్ట్ లో వినిపిస్తోంది. మరి మెగాస్టార్ వీరిలో ఏ డైరెక్టర్ తో తన నెక్ట్స్ సినిమాను చేస్తాడో చూడాలి.













