అసలు ఎవరీ ఇమాన్వీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రీసెంట్ గానే ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఫౌజి అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్తమ్మాయిని ఎంపిక చేయడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమెపై పడింది.
అయితే రెగ్యులర్ గా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పే పన్లేదు కానీ సగటు సినీ ప్రేక్షకులకు మాత్రం ఆమె ఎవరనేది తెలియదు. ఇమాన్వీది ఢిల్లీ. డ్యాన్స్ పట్ల ఉన్న ఇష్టం వల్ల ఉన్నత చదువులు చదివినప్పటికీ డ్యాన్స్ ను వదులుకోకుండా ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ కొత్త స్టైల్స్ ను కనిపెట్టడానికి కష్టపడేది.
ఇమాన్వీ ఇంట్రెస్ట్ ను తెలుసుకున్న తండ్రి ఆమెను ప్రోత్సహించి యూట్యూబ్ ఛానెల్ పెట్టించాడు. దీంతో జాబ్ కు రిజైన్ చేసి మరీ ఇమాన్వీ డ్యాన్స్ పై ఫోకస్ పెట్టి ఫుల్ టైమ్ డ్యాన్సర్ గా మారింది. రీల్స్, ఈవెంట్స్ చేస్తూ డ్యాన్సే తన ప్రపంచంగా ఉండిపోయింది. ఇమాన్వీ తండ్రి మాత్రమే కాదు తన తల్లి కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించింది. ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఇంకా ఎలా కొత్తదనం తీసుకురావచ్చని తన తల్లి ఎంతో ఉత్తేజపరిచేది. అలా ఇన్స్టాలో ఫేమస్ అయిన ఇమాన్వీ, హను దృష్టిలో పడి ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. పీరియాడిక్ ఫిల్మ్ అంటున్నారు కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యతే ఉంటుంది. దానికి తోడు హను తన మొదటి సినిమా నుంచి ప్రతీ సినిమాలోనూ హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. ఇప్పుడు ఇమాన్వీకి కూడా ఈ సినిమాతో మంచి పాత్ర ఇచ్చి ఆమె కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లనున్నాడు.













