అఖండ2 కథేంటంటే
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ కాంబోలో ఈసారి ఎలాంటి సినిమా రాబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.14 రీల్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా సినిమాను దసరా లేదా దీపావళి నుంచి మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య, అది పూర్తవగానే బోయపాటి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమా అఖండ2నే అని సమాచారం.
అయితే ఈ సినిమాలో ఏయే అంశాలుంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా ప్రధానంగా అఘోరా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందట. ఎలక్షన్స్ ముందు బోయపాటి శీను రాసుకున్న వెర్షన్ లో గత ప్రభుత్వం మీద సెటైర్లున్నాయట. ఎలాగూ టీడీపీ కూటమి గెలుస్తుందనే నమ్మకంతో స్క్రిప్ట్ ని చాలా ప్లాన్డ్ గా రెడీ చేసుకున్నాడట. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ను మార్చకుండా ఆ కథతోనే ముందుకెళ్లబోతున్నారని తెలుస్తోంది. అఘోరా ఫ్లాష్ బ్యాక్ ను కూడా బోయపాటి ఎంతో పవర్ఫుల్ గా ప్లాన్ చేశాడని సమాచారం. వచ్చే ఏడాది దసరాకు అఖండ2ని రిలీజ్ చేసే విధంగా ఈ సినిమాను పూర్తి చేయనున్నారట.













