యానిమల్ లో కబీర్ సింగ్ రోల్ మిస్
సందీప్ రెడ్డి వంగా ఇప్పటి వరకు చేసింది మూడు సినిమాలే అయినా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ దక్కించుకున్న సందీప్, తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అని తీయనున్నాడు. ఈ సినిమా ఇంకా మొదలు కాకముందు నుంచే సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
సందీప్ తన మొదటి సినిమాను విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి అని చేసి సంచలన హిట్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత అదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించాడు సందీప్.
ఇక గతేడాది తీసిన యానిమల్ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు సందీప్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్టయ్యి, మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత రణ్బీర్ గన్ షూట్ కు గురవడంతో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది. అప్పుడు రణ్బీర్ కు వైద్యం చేసే డాక్టర్ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా మొదటిగా హీరో షాహిద్ కపూర్ ను అనుకున్నాడట. వారిద్దరి మధ్య మంచి సీన్ జరిగేలా డైలాగ్స్ కూడా రాసుకున్నాడట కానీ షాహిద్ కపూర్ డేట్స్ సెట్ అవక సందీప్ ప్లాన్ అంతా మార్చుకున్నాడని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సందీప్ ప్లాన్ వర్కవుట్ అయ్యుంటే సందీప్ యూనివర్స్ లో భాగంగా తీసినట్లు యానిమల్ ఉండేదని, ఇప్పటికైనా మించిపోలేదని, యానిమల్ పార్క్ లో సందీప్ ప్లాన్ వర్కవుట్ అయ్యే ఛాన్సుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













