పదే పదే దాని గురించే ఎందుకు శృతీ?
రియల్ లైఫ్ లో ఎలాగైతే మనకు ఇష్టంలేని సంఘటనలు జరుగుతుంటాయో రీల్ లైఫ్ లోనూ అలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. అలాంటివి జరిగినప్పుడు సర్దుకుపోవాలి. అప్పుడే నటీనటుల స్థితప్రజ్ఞత బయటపడుతోంది. వీలైనంత వరకు వాటి గురించి బయటపడకపోవడమే మంచిది. కానీ శృతి హాసన్ మాత్రం అబ్బే అదేం లేదన్నట్లు చేస్తుంది.
జనవరిలో రిలీజైన వాల్తేరు వీరయ్యలో రెండు సాంగ్స్ షూట్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు చిరూతో కలిసి మంచులో డ్యాన్సు చేయాల్సి రావడం, చలిని భరించలేకపోవడం, దాని వల్ల ఇబ్బంది పడటం గురించి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. 60 ఏళ్ల చిరూకి లేని ప్రాబ్లమ్ శృతికి ఎందుకొచ్చిందోనని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.
రీసెంట్ గా శృతి ఫ్యాన్ ఫెస్టివల్ ప్రోగ్రం చేశారు. అక్కడ శృతి యాంకర్‌తో మాట్లాడుతూ, మళ్లీ ఈ పాట గురించి ప్రస్తావించింది. నేను వద్దని బ్రతిమాలినా చీర కట్టించి చలిలో డ్యాన్స్ చేయించారని మళ్లీ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతుంది. శృతి చేసిన కామెంట్ల వల్ల టాలివుడ్ దర్శకనిర్మాతలు బలవంతంగా ఇబ్బంది పెట్టినట్లు మెసేజ్ వెళ్లింది.
దీంతో మళ్లీ మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగి శృతిని నిలదీయడం మొదలెట్టారు. అయినా జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ తవ్వుకుంటే ఏమొస్తుందని, ఇదంతా దృష్టిలో పెట్టుకునే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ కి శృతి హాజరు కాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శృతి ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తుంది.













