ఇద్దరూ హ్యాట్రిక్‌కి సిద్ధమయ్యారు… సుజిత్‌కి హ్యాండ్ ఇచ్చారు?
సినిమా అనేది టీమ్ వర్క్ అంటారు. ఒక సినిమా ఘన విజయం సాధించిందంటే అందులో 24 శాఖల కృషి ఉంటుంది. టీమ్ వర్క్‌తోనే ఈ విజయం సాధ్యమైంది అని హీరో నుంచి డైరెక్టర్ వరకు అందరూ చెబుతారు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దాన్ని డైరెక్టర్‌కే ఆపాదిస్తారు. అంటే సినిమాలో డైరెక్టర్ పార్టిసిపేషన్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కేవలం డైరెక్టర్ వల్లే హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అందుకే కొంతమంది హీరోలు డైరెక్టర్ల ఎంపిక విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి తాజా సినిమాకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం చేస్తున్న చిరంజీవి ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమా ప్లాన్ చేశాడు. మలయాళంలో సూపర్‌హిట్ అయిన `లూసిఫర్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాని తనయుడు రామ్‌చరణ్ నిర్మించనున్నాడు. మలయాళంలో `లూసిఫర్` చిత్రానికి నటుడు పృథ్విరాజ్ దర్శకత్వం వహించాడు.
తెలుగు రీమేక్‌కి ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే విషయంలో బాగా ఆలోచించిన తర్వాత `సాహో` దర్శకుడు సుజిత్‌ని ఎంపిక చేశాడు చిరంజీవి. `లూసిఫర్` స్క్రిప్ట్‌పై కొంతకాలం వర్క్ చేసి తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఫైనల్ స్క్రిప్ట్‌ని చిరుకి వినిపించాడట సుజిత్. కానీ, సుజిత్ డెవలప్ చేసిన సబ్జెక్ట్ చిరంజీవికి నచ్చలేదట. అతని వర్క్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఇంత హెవీ సబ్జెక్ట్‌ని ఓ సీనియర్ డైరెక్టర్ అయితే బాగా హ్యాండిల్ చేస్తాడని భావించిన చిరంజీవి ఆ బాధ్యతను వినాయక్‌కి అప్పగించాలని చూస్తున్నాడట. గతంలో చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూడో ప్రాజెక్ట్ కూడా వినాయక్ చేతికే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలూ తమిళ్ రీమేక్‌లు కావడం విశేషం. అయిఏ వీరిద్దరి కాంబినేషన్లో `లూసిఫర్` రీమేక్ చేస్తున్నారనే విషయం అధికారికంఆ ప్రకటించాల్సి ఉంది.













