అది కాక పోతే దాన్ని బాబు లాంటి కథ మెగాస్టార్ కి రెడీ చేస్తున్నాడట వినాయక్!
వివి వినాయక్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 కి డైరెక్షన్ చేసి దానితో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న వినాయక్ అతి త్వరలో మెగాస్టార్ తో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ని తెరకెక్కించనున్నారు అంటూ పక్క న్యూస్ బయటకొచ్చింది. ఇటీవల కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి కూడా. అయితే కొద్ది రోజుల క్రితం ఆ సినిమా కి ఎడిటర్ మోహన్ తనయుడు హనుమాన్ జంక్షన్ దర్శకుడు మోహన్ రాజాని ఎంపిక చేసింది మూవీ యూనిట్. దానితో వినాయక్ కి మరొకసారి మెగాస్టార్ తో సినిమా తీసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.
అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ అవకాశం మిస్ అయినప్పటికీ మరోవైపు మెగాస్టార్ కోసం స్టైట్ గా ఒక అదిరిపోయే పవర్ఫుల్ స్టోరీని ప్రస్తుతం సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారట వినాయక్. మాస్ క్లాస్ ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి వినాయక స్టోరీ రెడీ చేస్తున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో మెగాస్టార్ కి స్టోరీ వినిపించి ఎట్టి పరిస్థితుల్లో దానిని ఏప్రిల్ తర్వాత పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారని, టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది…..!! మరి హీరో గా ఎంటర్ అవుతానన్న శీనయ్య చిత్రం ఏమైనట్టబ్బా?













