బాలయ్య ఏకే 47 ?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 104వ సినిమాకు రంగం సిద్ధం అయింది. పైసా వసూల్ తరువాత బాలయ్య హీరోగా నటిస్తున్న 103వ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యూనిట్లో దర్శకుడు క్రిష్ ఎంటర్ అవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఇంకాస్త టైం పట్టేలా ఉండడంతో ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలనీ భావించిన బాలయ్య తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పడంతో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రంగంలో దిగాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ పూర్తికావచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యం లోనే సినిమా ఉంటుందని టాక్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తరువాత వీరిద్దరితో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఈ సినిమాను సెట్‌చేశాడు. జులైలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తేనున్నారట. దాంతోపాటు సినిమాకు టైటిట్ పెట్టే ఆలోచనలో కూడా పడ్డారు. ఈ కథ ప్రకారం ఎకే 47 అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. మరి ఈ టైటిల్‌పై బాలయ్య ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.













