ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’
500 సినిమా లకు పైగా లోగోస్ 100 సినిమా లకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి ( విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు ) హీరోగా ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా ప్రతాప్ భీమవరపు దర్శకత్వం ఓ తండ్రి తీర్పు సినిమా ఎడిటింగ్ పూర్తయింది. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా పూర్తయిన ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు.













