విశ్వంభర బడ్జెట్ పెంచేస్తున్నారుగా!
భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి తన తర్వాతి సినిమా ను బింబిసార ఫేమ్ వశిష్ఠతో చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై రోజురోజుకీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాతలు రూ.150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నారు.
కానీ సినిమా అవుట్పుట్ బాగా వస్తుండటం వల్ల విశ్వంభర బడ్జెట్ ను ఇంకొంచెం పెంచి దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని చూస్తున్నారట. విశ్వంభర సినిమా మొత్తం ఎక్కువ గ్రాఫిక్స్ తోనే ముడి పడి ఉంది. ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని వశిష్ఠ చూస్తున్నాడు. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ డిసైడయ్యారట.
చిరంజీవి సినిమాకి అందులోనూ విశ్వంభర లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టినా రిస్క్ లేనట్టే. ఈ సినిమాలో ఆడియన్స్ సర్ప్రైజ్, థ్రిల్లయ్యే అంశాలు చాలానే ఉండనున్నాయట. విశ్వంభరతో మెగా ఫ్యాన్స్ మరోసారి వింటేజ్ చిరూని చూడనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకునేలా మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.













