సక్సెస్లతో దూసుకెళ్తున్న విశ్వక్
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ విశ్వక్సేన్. తెలంగాణ నుంచి విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ మధ్య ఎప్పుడూ మంచి పోటీ ఉంటుంది. కమర్షియల్ గా విజయ్ ఇమేజ్ కొంచెం ఎక్కువైనప్పటికీ సక్సెస్ పరంగా చూస్తే మాత్రం విశ్వక్ యే ముందు ఉన్నాడు.
బంగారు బాబు సినిమాతో 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విశ్వక్, ఆ తర్వాత వెళ్లిపోమాకే మూవీతో తన కెరీర్ ను హీరోగా స్టార్ట్ చేశాడు. అనంతరం ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత ఫలక్నుమా దాస్ సినిమాతో మరో హిట్ ను అకౌంట్ లో వేసుకున్నాడు. ఫలక్నుమా దాస్ కు డైరెక్టర్ గా మారి, తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు విశ్వక్.
ఆ పిమ్మట హిట్ ది పస్ట్ కేస్ మూవీలో సీరియస్ రోల్ లో నటించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. నెక్ట్స్ పాగల్ అనే డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చి యావరేజ్ అనిపించుకున్నాడు. తర్వాత అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా విశ్వక్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర చేసింది.
ఇక గతేడాది దాస్ కా ధమ్కీ అంటూ మరో హిట్ ను అందుకున్నాడు విశ్వక్. ఇక తాజాగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో గామి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్, మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ విధంగా చూసుకుంటే విశ్వక్ కెరీర్ లో 95% సక్సెస్ రేట్ ను కొనసాగిస్తూ తనదైన మార్క్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసే నిర్మాతలకు విశ్వక్ మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. చూస్తుంటే విశ్వక్ కెరీర్ త్వరలోనే మరో స్థాయికి వెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది.













