స్పీడ్ పెంచిన మాస్ కా దాస్
డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మెప్పించిన విశ్వక్, ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా రామ్ తాళ్లూరి నిర్మాణంలో రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ సినిమా చేస్తున్నాడు. మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న మెకానిక్ రాకీ సాంగ్ ను లాంచ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 31న మెకానిక్ రాకీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా బిజినెస్ డీల్స్ కోసం ఎదురు చూస్తోంది.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి విశ్వక్ కు జోడీగా నటిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించనుంది. మరి ఈ సినిమాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేక ఏంటన్నది తెలియదు. జులై 26న జరిగే మీడియా మీట్ లో కథ గురించి ఏమైనా చెప్పే ఛాన్సుంది. ఇదిలా ఉంటే విశ్వక్ రీసెంట్ గా లైలా అనే సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాడు. రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి ఉండే అవకాశముంది. మొత్తానికి విశ్వక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడన్నమాట.













