ఇన్‌స్టా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసిన విశ్వక్
డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్సేన్. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వాటిలో మెకానిక్ రాకీ షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. ఇదిలా ఉంటే విశ్వక్ ను తన సినిమా రిలీజ్ టైమ్ లో కావాలని కొంతమంది సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుంటారు. వాటికి విశ్వక్ కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతుంటాడు. తాజాగా కల్కి సినిమా రిలీజ్ కాకుండా నెట్టింట ఓ వ్యక్తి దాని గురించి నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దీనిపై విశ్వక్ తిరిగి ఆ వ్యక్తికి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మ్యాటర్ కాంట్రవర్సీ అవడంతో విశ్వక్ సైలెంట్ అయ్యాడు. ఇక తాజాగా విశ్వక్ తన ఇన్‌స్టా అకౌంట్ ను డిలీట్ చేశాడు. రీజన్ ఏంటనేది తెలియలేద కానీ విశ్వక్ తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేసినట్లు అయితే తెలుస్తోంది. సినిమాల మీదే ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతోనే విశ్వక్ సోషల్ మీడియాకు దూరమయ్యాడని అంటున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్ తిరిగి సోషల్ మీడియాకు రావాలని తన ఫ్యాన్స్ కోరుతున్నారు. గతంలో కూడా విశ్వక్ ఎన్నో సార్లు కాంట్రవర్సీల్లో చిక్కుకున్నాడు. కానీ ప్రతీ దానికీ విశ్వక్ తన సినిమాలు, నటనతో ఆన్సర్ చెప్తూ వస్తున్నాడు.













