ఎన్టీఆర్ ను హృతిక్ కూడా మ్యాచ్ చేయలేడు విశ్వక్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్(Viswaksen) జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కు చాలా పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా విశ్వకే చాలా సార్లు చెప్పాడు. ఛాన్స్ వచ్చిన ప్రతీసారి విశ్వక్, ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని బయటపెడుతూ ఉంటాడు. ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అని గతంలోనే విశ్వక్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
దేవర(Devara) రిలీజ్ టైమ్ లో కూడా విశ్వక్ ఆ సినిమాపై, ఎన్టీఆర్ పై ఎన్నో ఎలివేషన్స్ ఇచ్చాడు. రీసెంట్ గా విశ్వక్ దేవర 50 డేస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విశ్వక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్(Hrithik Roshan) కూడా ఎన్టీఆర్ ను మ్యాచ్ చేయలేడని విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి హిందీలో వార్2(War2) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ మంచి నటులని పేరుంది. అలాగే ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కూడా. ఇలాంటి టైమ్ లో విశ్వక్సేన్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ(Mechanic Rockey) నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.













