Viswaksen: విశ్వక్ కూడా ఉంటే బావుండేది
నాని(Nani) హీరోగా వచ్చిన హిట్3(Hit3) సినిమా మంచి టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో అడివి శేష్(Adivi Sesh) క్యామియో చేశాడు. సినిమాలో అతని పాత్ర చాలా డీసెంట్ గా ఉంది. హిట్3 లో అడివి శేష్ ఉంటాడనే వార్త ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే లీకైంది. దీంతో చాలా మందికి శేష్ ను చూసినా పెద్ద సర్ప్రైజ్ ఫీలవలేదు. ఎవరైతే ఈవెంట్ చూడలేదో వారికి మాత్రం శేష్ క్యామియో తో ఇచ్చిన సర్ప్రైజ్ వర్కవుట్ అయింది.
అయితే శేష్ క్యామియో పెట్టి, హిట్1 హీరోగా నటించిన విక్రమ్ రుద్రరాజు పాత్రను ఎందుకు పెట్టలేదని, విశ్వక్(Viswak) కూడా సినిమాలో ఉంటే హిట్3 మరింత బావుండేదని అభిప్రాయ పడుతూ నెటిజన్లు హిట్1(Hit1) లోని కొన్ని సీన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లోనే హిట్ మూవీకి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
అందుకే విశ్వక్ కూడా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హిట్వర్స్ తనకు బిడ్డలాంటిదని చెప్పాడు. మరి అలాంటి విశ్వక్ క్యామియోను హిట్3 లో శైలేష్(Sailesh Kolanu) ఎందుకు వాడుకోలేకపోయాడు? శైలేష్ అసలు హిట్3 లో విక్రమ్ రుద్రరాజు పాత్ర గురించి రాయలేదా లేక విశ్వకే ఆ పాత్రను చేయనని చెప్పడం వల్ల ఆ క్యామియో కుదరలేదా అనేది వారికే తెలియాలి. ఫ్యూచర్ లో మాత్రం విశ్వక్ హిట్వర్స్ లో భాగంగా వచ్చే సినిమాలో కనిపించడం మాత్రం ఖాయమని నాని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.






