Vassishta: ఎక్స్‌లో చిరూపై విశ్వంభర డైరెక్టర్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), వశిష్ట(Vasishta) కాంబినేషన్ లో విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ వస్తున్న విషయం తెలిసిందే. త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్(UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఆస్కార్ విజేత కీరవాణి(Keeravani) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి.
కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజైందో వీఎఫ్ఎక్స్ వల్ల విశ్వంభరపై కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర యూనిట్ ఆ బాధ్యతల్ని మరో టీమ్ కు అప్పగించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే విశ్వంభర డైరెక్టర్ వశిష్ట తాజాగా ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
ఖైదీ(Khaidhi) సినిమాలో వింటేజ్ చిరూ వీడియోను షేర్ చేస్తూ దానికి ఫైర్ ఎమోజీని జోడించి వశిష్ట పోస్ట్ చేశాడు. మరి ఖైదీ సినిమాకీ విశ్వంభరకీ ఏదైనా లింకుందా లేక ఖైదీ మాదిరి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా లేక ఖైదీ లోని వింటేజ్ చిరూని విశ్వంభరలో కూడా చూపిస్తున్నాడా అనేది తెలియాలంటే వశిష్టనే క్లారిటీ ఇవ్వాలి. వశిష్ట చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
https://x.com/DirVassishta/













