Viswaksen: విశ్వక్ సినిమా క్యాన్సిల్?
టాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు విశ్వక్సేన్(Viswaksen). రీసెంట్ గా తన నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నాయి. రిజల్ట్ ను పక్కనపెడితే విశ్వక్ రెగ్యులర్ కథల్ని కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు.
ఇలాంటి టైమ్ లో విశ్వక్సేన్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి క్యాన్సిల్ అయింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మించనున్న బందూక్(Bandhook) మూవీని ముందు ఓ కొత్త డైరెక్టర్ తో చేయాలని డిసైడ్ దానికి కథ, క్యాస్టింగ్ అన్నీ ఓకే చేసుకున్నాక సినిమా అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది. ఈ సినిమా కోసం విశ్వక్ కు మంచి రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారు నిర్మాతలు.
కానీ సినిమా షూటింగ్ కు సంబంధించి డేట్స్ మారడం జరిగిందని సమాచారం. అయితే కొత్త డైరెక్టర్ పై అనుమానంతోనే విశ్వక్ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీంతో నిరాశకు గురైన నిర్మాత సుధాకర్ ఈ కథను మరో హీరోతో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. ఇది విశ్వక్ కు షాక్ కు మారింది.













