వినయ విధేయ రామ టీజర్ విడుదల
రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కైరా అద్వాణీ కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. రేయ్.. నువ్వు పందెం పరశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్..రామ్ కొణిదెల అంటూ రామ్‌చరణ్ ఆవేశంగా హెచ్చరిస్తున్న డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. యుద్ధ విజేత రా..వినయ విధేయ రామ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ రొమాంచితంగా సాగింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.













