వినయ విధేయ రామ టాకీ పూర్తి
రామ్చరణ్ పట్టు వస్త్రాలను ధరించి, నుదుట కుంకుమ పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఉన్న ఫొటోను వినయ విధేయ రామ యూనిట్ విడుదల చేసింది. డి.పార్వతి సమర్పిస్తున్న చిత్రమిది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకుడు. కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలతో చిత్ర పోస్టర్ విడుదలైంది. నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ టాకీ పూర్తియింది. మూడు పాటలను కూడా చిత్రీకరించాం. హైదరాబాద్లో వేసిన సెట్లో డిసెంబర్ 10 నుంచి ఓ పాటను తెరకెక్కిస్తాం అని అన్నారు. ఇందులో కియారా అడ్వాణీ నాయిక. వివేక్ బబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు.













