వీర రౌద్ర రామ ఫస్ట్ లుక్ విడుదల
రాముడంటే వినయం, విధేయత మాత్రమే కాదు.. వీరుడు, ధీరుడు కూడా. ఈ లక్షణాలన్నీ మా కథానాయకుడికీ ఉంటాయంటున్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కైరా అడ్వాణీ కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రానికి వినయ విధేయ రామ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈనెల 9న టీజర్‌ని చూపిస్తారు. చరణ్ అభిమానులకు పండగలాంటి చిత్రమిది. చరణ్ ధీరత్వం ఈ సినిమాలో మరో సారి కనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా బోయపాటి శ్రీను తీర్చిదిద్దుతున్నారన్నారు నిర్మాత. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్.













