ప్రేమలో పడిన రాశీఖన్నా
దిల్లీకు చెందిన అందాల తార రాశీ ఖన్నా ప్రేమలో పడిందనే వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముంబై పరిశ్రమలో నెమ్మదిగా తన గ్రాఫ్ ను పెంచుకుంటున్న రాశీ, తన స్నేహాలను కూడా పెంచుకుంటుంది. అయితే రాశీ ఇప్పుడు ఎవరి ప్రేమలో పడింది? తన కో స్టార్స్ తోనా లేక ఇంకెవరైనా బయటి వారా అని అనుకొంటుండగా రాశీ ఓ కథతో ప్రేమలో పడిందని తెలిసింది.
ఇటీవలే ఓ ప్రేమ కథ విన్న రాశీకి, ఆ కథ బాగా నచ్చడంతో ప్రేమలో పడిందట. చిన్న టైన్ నుంచి మెట్రో సిటీలోకి ఎంటరైన అందమైన అమ్మాయి, అక్కడున్న ఒక ఆకతాయి అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత అతనితో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగిందనేదే సినిమా కథగా తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోగా విక్రాంత్ మాస్సే నటిస్తుండగా, హీరోయిన్గా రాశీ కనిపించనుంది. బోధయన్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని, నవంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రాశీ అంతగా ప్రేమించిన ఈ ప్రేమకథ అమ్మడు కెరీర్‌కు ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.













