Vishnav Tej: విక్రమ్ తో వైష్ణవ్ నెక్ట్స్ మూవీ?
ఉప్పెన(Uppena) మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుని రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించాడు. ఉప్పెనతో మంచి సక్సెస్ ను అందుకోవడమే కాకుండా తన నటనతో ఆడియన్స్ ను అలరించిన వైష్ణవ్ తో సినిమాలు చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించగా, వైష్ణవ్ కూడా ఆ ఛాన్సులను వాడుకుని వరుస సినిమాలు చేశాడు.
కానీ వైష్ణవ్ నుంచి తర్వాత వచ్చిన కొండపొలం(Kondapolam), రంగరంగ వైభవంగా(Ranga Ranga Vaibhavamga), ఆదికేశవ(Adhikeshava).. ఏ సినిమా వైష్ణవ్ కు సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. కెరీర్లో వరుస ఫ్లాపులు పడటంతో వైష్ణవ్ ఇకపై సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని డిసైడయ్యాడు. అందుకే కథలు వింటున్నాడు తప్పించి ఎవరికీ గత రెండేళ్లుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రెండేళ్లుగా ఖాళీగా ఉన్న వైష్ణవ్ ఇప్పుడు ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
మనం(Manam), 24 ఫేమ్ విక్రమ్ కుమార్ రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ కు ఓ కథ చెప్పాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే విక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను రెడీ చేసి వైష్ణవ్ కు వినిపించనున్నారని, ప్రస్తుతానికైతే డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ తో పాటూ విజయ్ దేవరకొండ(Vijay devarakonda) కోసం కూడా విక్రమ్ కుమార్ ఓ కథపై వర్క్ చేస్తున్నారని టాక్. కాగా విక్రమ్ తో పాటూ వైష్ణవ్ ఇతర డైరెక్టర్లతో కూడా డిస్కషన్స్ చేస్తున్నాడని కానీ ఏదీ ఫైనల్ అవలేదని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఏడాదిలో వైష్ణవ్ నెక్ట్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.






