విక్రమ్ ఇమేజ్‌కు డ్యామేజ్ జరుగుతోందా?
స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడితే ఫ్యాన్స్ ఎంతగా డిజప్పాయింట్ అవుతారో స్పెషల్‌గా చెప్పాల్సిన పన్లేదు. ఎన్నో అంచనాలు, ఆశలతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లడంతో పాటూ తీవ్ర నెగిటివిటీ కూడా దారి తీస్తుంది. చివరకు సినిమాపైన ఆశలు పోయి, అప్పటివరకు సినిమాను ఎంకరేజ్ చేసిన ఫ్యాన్సే సినిమా గురించి నెగిటివ్‌గా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు.
సినిమా గురించి అప్డేట్స్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఎంతో గోల చేస్తారన్న విషయం తెలిసిందే. అదే రిలీజ్ ను పదే పదే వాయిదా వేస్తూ పోతే ఆ నెగిటివిటీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా చియాన్ విక్రమ్ విషయంలో ఇలాంటి సీనే కనిపిస్తోంది. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవ నక్షత్రం స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కొన్నేళ్ల కిందటే స్టార్ట్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల సెట్స్ కి ఆలస్యంగా వెళ్లడంతో షూటింగ్ కూడా బాగా లేటయింది. దీంతో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయారు. రీసెంట్ గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని డైరెక్టర్ అనౌన్స్ చేయడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సినిమా ఎక్కువ సార్లు వాయిదా పడటంతో ఈ సినిమాపై హైప్ కూడా ఎక్కడా కనిపించడం లేదు.
దీంతో పాటూ విక్రమ్ పా.రంజిత్ తో చేసిన తంగలాన్ మూవీ కూడా భారీ అంచనాల మధ్య వస్తోంది. ఇప్పటికే రిలీజైన విక్రమ్ లుక్ చూస్తుంటే తంగలాన్ భారీ ప్రయోగాత్మక సినిమాగా కనిపిస్తోంది. సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చూస్తుంటే ఈ సినిమాల పోస్ట్‌పోన్స్ విక్రమ్ ఇమేజ్ పై చాలా ఎఫెక్ట్ చూపేలా అనిపిస్తుంది.













