మహేష్ కాబట్టే అంత టైమ్ పట్టిందన్న స్టార్ రైటర్
మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ కు ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఆయన తెలిపారు. డేట్, మిగిలిన వివరాలేమీ చెప్పలేదు కానీ జనవరి అని మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ గురించి చెప్తూ మామూలుగా ఏ స్టార్ హీరోకైనా కథ రెడీ చేయడానికి నెలల టైమ్ సరిపోతుందని, కానీ మహేష్ బాబు కాబట్టే రెండేళ్ల టైమ్ పట్టిందని ఆయన అన్నారు.
విజయేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో ఎక్స్పీరియెన్స్ ఉన్న రైటరే ఇంత మాట చెప్పారంటే స్క్రిప్ట్ ఏ రేంజ్ లో వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ వివరాలు చెప్పకపోయినా తక్కువ మాటలతోనే ఆయన మహేష్ కు ఎంతో ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మొదలవాలంటే మరో రెండు నెలల పాటూ వెయిట్ చేయక తప్పదన్నమాట. ఈ సినిమాకు ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, మరోవైపు డమ్మీ షూట్స్ అన్నీ జరుగుతున్నాయి.













