కథ రెడీ అయిందన్న విజయేంద్ర ప్రసాద్
గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు థియేటర్లలో సందడి చేస్తుండగానే, ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళితో మహేష్ చేయనున్న సినిమాపై పడింది. రెండేళ్ల ముందే ఈ సినిమాను అనౌన్స్ చేయగా, ఇంకా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పట్టేట్లుంది. రాజమౌళి సినిమా అంటే కథ కోసం ఒక సంవత్సరం, ప్రీ ప్రొడక్షన్ కోసం ఒక సంవత్సరం, షూటింగ్ కోసం రెండేళ్లు మొత్తం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు టైమ్ పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.
అందుకే ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని పూర్తి చేసినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి గత కొంత కాలంగా విజయేంద్ర ప్రసాద్ హింట్స్ ఇస్తున్నారు కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు మాత్రం ఇప్పుడే చెప్పారు.
సినిమా స్క్రిప్ట్ ఫినిష్ అయిందంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నట్లే. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుందని మహేష్ ఫ్యాన్స్ తెగ ఎగ్జయిట్ అవుతున్నారు. ఆస్ట్రేలియన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని ఈ సినిమా గురించి రాజమౌళి ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు.













