Vijay Varma: నాన్న ఎంతో స్ట్రిక్ట్.. అందుకే ఇంట్లోంచి పారిపోయా

జయ్ వర్మ(Vijay Varma). ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మ నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah)తో రిలేషన్‌షిప్ మెయిన్ టెయిన్ చేసి అంతే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ బ్రేకప్ అయింది. దానికి కారణాలేంటనేది కూడా ఎవరికీ తెలియదు.
షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ వర్మ ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమాలు, సిరీస్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ అసలు తాను సినిమాల్లోకి ఎలా వచ్చాడనే విషయంపై ఓపెన్ అయ్యాడు. తాను సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు అసలు ఒప్పుకోలేదని చెప్పాడు.
ఇంట్లో తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని, తన తండ్రి తన ఆసక్తిని ఒప్పుకోనందు వల్లే తాను ఇంట్లో నుంచి పారిపోయి యాక్టింగ్ స్కూల్ లో చేరాల్సి వచ్చిందని, ఇంట్లో నుంచి పారిపోయి బయటికి వచ్చినప్పటికీ ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయని, తన కుటుంబమంతా ఇప్పుడు తనని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నారని విజయ్ తెలిపాడు.