సైలెంట్ గా హిట్ కొట్టిన సేతుపతి
ఓ వారం కిందట వరకు మహారాజా పేరుతో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ సినిమా చేశాడనే సంగతి చాలా మందికి తెలీదు. కట్ చేస్తే డబ్బింగ్ రైట్స్ కొనడం, రెండు లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేయాలని డిసైడవడంతో చాలా తక్కువ టైమ్ లోనే సేతుపతి లేట్ చేయకుండా హైదరాబాద్ వచ్చి, ఇక్కడ రెండు మూడు రోజులు ఉండి సినిమాను ప్రమోట్ చేసి ఆడియన్స్ ఫోకస్ తనవైపు మరల్చుకున్నాడు.
ఇప్పుడు అతని నమ్మకమే నిజమైంది. మహారాజా ఆడియన్స్ మద్దతు పొందడంలో సక్సెస్ అయింది. సీరియస్ కాన్సెప్ట్ అయినప్పటికీ డైరెక్టర్ నితిలన్ దాన్ని హ్యాండిల్ చేసిన తీరుకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. పాజిటివ్ టాక్ రావడంతో మార్నింగ్ షోల కంటే ఈవెనింగ్ టైమ్ షోలకు కౌంట్ పెరిగింది. మెయిన్ థియటర్లైతే దాదాపు ఫుల్ అయ్యాయి.
ఇది సేతుపతి కెరీర్లో వచ్చిన 50వ సినిమా కావడంతో ప్రమోషన్స్ పరంగా టీమ్ చాలా జాగ్రత్తలే తీసుకుంది. తెలుగుకే ఇలా ఉంటే ఇక తమిళనాడు లో చెప్పే పన్లేదు. ఈ ఇయర్ రిలీజైన అతి పెద్ద హిట్స్ లో మహారాజా కూడా ఒకటిగా నిలవడం ఖాయమంటున్నారు. గత రెండు మూడు నెలలుగా కోలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఇప్పుడు మహారాజా ఆ లోటును తీరుస్తుందని, కల్కి వచ్చే వరకు మహారాజాకు కలెక్షన్ల కొరత ఉండదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.













