రామాయణం నుంచి తప్పుకున్న సేతుపతి
కొన్ని వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నితీష్ తివారీ రామాయణాన్ని మూడు భాగాలుగా ప్లాన్ చేశాడు. ఇది ఇంకా మొదలవకముందే షాక్ తగిలిందని ముంబై మీడియా వర్గాలంటున్నాయి. ఈ సినిమాలో విభీషణుడిగా నటించడానికి ఒప్పుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు డేట్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ డేట్స్ ఇవ్వడానికి కుదరకపోవడం వల్ల తన బదులు మరొకరిని చూసుకోవాలని డైరెక్టర్ నితీష్ కు సేతుపతి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు సేతుపతి స్థానంలోకి హర్మన్ బవేజా వచ్చినట్లు తెలుస్తోంది. రామనవమి సందర్భంగా వచ్చే నెల గ్రాండ్ గా ఈ సినిమాను అయోధ్యలో మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి చాలా విషయాలను చిత్ర యూనిట్ రహస్యంగా ఉంచుతుంది. ఇప్పటివరకు హీరోగా రణ్ బీర్ కపూర్ అన్న విషయాన్ని మాత్రమే కన్ఫర్మ్ చేశారు. సీతగా సాయిపల్లవిని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. రావణుడిగా నటించేందుకు కన్నడ రాక్ స్టార్ యష్ ఒప్పుకున్నాడని, దాని కోసం యష్ కు రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశారని కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాలపై చిత్ర బృందం మౌనంగానే ఉంది. రామాయణం మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతుండటం వల్ల ఆర్టిస్టుల డేట్స్ భారీ సంఖ్యలో కావాల్సి ఉంది. ఇప్పుడు అదే నితీష్ కు పెద్ద సమస్యగా మారింది. 2026లో ఈ సినిమా మొదటి భాగాన్ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













