Vijay Sethupathi: డైరెక్టర్ల ట్రాక్ రికార్డు పట్టించుకోను
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు కూడా. అయితే ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూరీకి ఎలా ఛాన్స్ ఇచ్చారని సేతుపతిని ట్యాగ్ చేసి మరీ అడుగుతున్నారు.
తాజాగా ఈ విషయంపై సేతుపతి స్పందించారు. డైరెక్టర్ల ఫామ్ గురించి తాను పట్టించుకోనని, స్క్రిప్ట్ నచ్చితే సినిమా ఒప్పుకుంటానని, పూరీ చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఎప్పుడూ కొత్తదనం కోరుకునే తాను ఈ తరహా కథ చేయనందునే పూరీ స్క్రిప్ట్ కు ఓకే చెప్పానని, జూన్ నుంచి సినిమా మొదలుకానుందని తెలిపారు. ఈ సినిమాలో టబు(Tabu)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సేతుపతి చెప్పారు.
తాను చేసిన సినిమాల్లో మహారాజా(Maharaja) మూవీ తనకు చాలా ప్రత్యేకమని చెప్తున్న సేతుపతి, ఆ సినిమాలోని కొన్ని సీన్స్ చేసేటప్పుడు వణికిపోయానని వెల్లడించారు. సూపర్ డీలక్స్(Super Deluxe), ఉప్పెన(Uppena) మూవీస్ లోని పాత్రలు కూడా కష్టమైనవే అయినప్పటికీ మహారాజా తనకు స్పెషల్ అని, ఎందుకంటే తాను కూడా ఓ అమ్మాయికి తండ్రినే అని సేతుపతి పేర్కొన్నారు.













