దర్శకుడిగా విజయ్ కొడుకు..
ఏదైనా కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయనప్పుడు అందులో స్టార్ హీరో నటిస్తుందో అది ఆ హీరో కెరీర్లో ఎన్నో సినిమానో చూసి దాన్నే వర్కింగ్ టైటిల్ గా పెట్టడం ఇప్పుడు కామనైపోయింది. హీరో కంటే డైరెక్టర్ కు ఎక్కువ స్టేటస్ ఉంటే ఆ డైరెక్టర్ కు ఎన్నో సినిమానో దాన్ని టైటిల్ గా పెడుతుంటారు. కానీ ఓ డైరెక్టర్ మొదటి సినిమాకు తన పేరు, 1 నెంబర్ కలిపి దాన్ని వర్కింగ్ టైటిల్ గా పెట్టడం మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు.
కానీ కోలీవుడ్ లో మొదటిసారి ఇది జరిగింది. జేసన్ సంజయ్1(Jason sanjay1) అంటూ ఓ కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న సందీప్ పేరును టైటిల్ గా పెట్టకుండా ఇలా డైరెక్టర్ పేరుని వర్కింగ్ టైటిల్ లో పెట్టడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది.
అయితే ఈ జేసన్ సంజయ్ ఎవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) కొడుకే జేసన్ సంజయ్. విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకుంటే అతను మాత్రం డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా(Lyca) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. టెక్నీషియన్స్ కూడా పేరున్న వారే పనిచేస్తున్నారు. తమిళంతో పాటూ తెలుగులో కూడా ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాతో విజయ్ కొడుకు ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.













